షాక్ నుంచి తేరుకున్న నితిన్ స్పీడ్ పెంచాడు

Sunday, October 15th, 2017, 11:10:21 AM IST

హీరో నితిన్ లై సినిమా తరువాత చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ నిర్మాతలు గా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. దాదాపు నెలరోజుల పాటు జరిగిన ఈ సినిమాలో నితిన్, మేఘ తో పాటు ఇతర ప్రధాన నటీనటులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అయిన నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ సినిమా నిర్మిస్తుండడంతో అందరి చూపు ఆ సినిమాపైనే పడింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను డిసెంబర్ లో విడుదల చేస్తారట. లై సినిమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న నితిన్ తదుపరి చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు.