మెగాఫోన్ పట్టేందుకు సిద్దమైన నిత్యా మీనన్ ?

Friday, March 2nd, 2018, 10:26:28 PM IST

లేటెస్ట్ గా నాని నిర్మించిన అ ! సినిమాలో లెస్బి ..* పాత్రలో నటించి ఆకట్టుకున్న క్రేజీ భామ నిత్యా మీనన్ త్వరలోనే దర్శకురాలిగా మారేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. తనకు సినిమాకు సంబందించిన అన్ని విషయాలు తెలుసుకోవడం ఇష్టమని, అందుకే తాను దర్శకురాలిగా మారేందుకు సిద్ధం అవుతుందట. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్బంగా మాట్లాడుతూ .. నిర్మాతగా చేయడం తనవల్ల కాదని .. కానీ ఖచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతుంది. నటిగా భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కేవలం .. సింగిల్ పాత్రతో ఓ సినిమాలో ప్రయోగం చేస్తుంది. తనకు రెగ్యులర్ గా ఉండే హీరోయిన్ పాత్రలు నచ్చవని .. సంచలన పాత్రలు కూడా చేయడానికి రెడీ అని చెప్పింది నిత్యా !!