టాప్ హీరో సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన నీవేథా..!

Thursday, June 3rd, 2021, 02:41:48 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో తన యాక్టింగ్ తో, క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నటి నివేథా థామస్. అయితే జెంటిల్మె న్ చిత్రం తో తెలుగు తెర కి పరిచయం అయిన ఈ భామ, అనంతరం పలు సినిమాల్లో నటించారు. నిన్నుకొరి, జై లవకుశ చిత్రాలతో నివేత తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే ఈ చిత్రాలతో సంపాదించుకున్న క్రేజ్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు ఆమె. అయితే ఇటీవల విడుదల అయిన వకీల్ సాబ్ చిత్రం లో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఈ చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయవాది గా నటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా లో నటించడం తో ఈ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి.

అయితే తాజాగా నివేతా ఒక టాప్ హీరో చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో నివేతా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మినిమం ఇద్దరి హీరోయిన్ లతో సినిమా చేస్తారు. ఒకరు లీడ్ రోల్ లో ఉండగా, మరొకరు ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తారు. అయితే నివెతా థామస్ లీడ్ రోల్ లో చేస్తారా లేఖ ప్రాధాన్యత గల పాత్రలో ఉంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.