దిల్‌రాజు బేరం 9కోట్లు.. తిరిగొచ్చిందెంత‌?

Tuesday, May 15th, 2018, 01:37:43 AM IST

అన్నివేళ‌లా స‌క్సెస్ ఒకేవైపు ఉంటుంద‌నుకుంటే పొర‌పాటే. కొన్నిసార్లు గెస్సింగ్ మిస్ ఫైర్ కావొచ్చు. అయితే అలా కాకుండా ఉండాలంటే ఇంకేదో మిరాకిల్ జ‌ర‌గాలి. కానీ ఈసారి అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. స‌ద‌రు నిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ అప్ర‌తిహ‌త విజ‌యాల‌కు పెద్ద కుదుపు లాంటి బ్రేక్ ప‌డింద‌ని చెప్పొచ్చు. ఇదంతా ఎవ‌రి గురించి అంటే నైజాం కింగ్ దిల్‌రాజు గురించే. ఆయ‌న హ‌స్త‌వాసి ఎంతో మంచిద‌ని అంటారు. గోల్డెన్ హ్యాండ్‌ చేప‌ట్టిన‌ది ఏదైనా మొద‌లుపెడితే విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంద‌ని అంటారు. కానీ ఎందుక‌నో దిల్‌రాజు హ్యాండు పూరి జ‌గ‌న్నాథ్‌కి, ఆయ‌న కొడుకుకి అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంకా చెప్పాలంటే శాపంగానూ మారింది. ఇటీవ‌లే రిలీజైన మెహ‌బూబా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ పూరీని చాలా ర‌కాలుగా క‌ల‌త‌కు గురి చేసింద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాని నైజాంలో 9 కోట్ల‌కు కొనుక్కుని రిలీజ్ చేసిన దిల్‌రాజుకు చాలా పెద్ద పంచ్ ప‌డింద‌ని చెబుతున్నారు. రిలీజ్ ముందు ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌డం ఖాయ‌మ‌ని దిల్‌రాజు & టీమ్ చెప్పుకున్నా అది జ‌ర‌గ‌లేదు. పైగా తాను కాద‌నుకున్న `మ‌హాన‌టి` మాత్రం దిగ్విజ‌యంగా ఆడుతోంది. మ‌హాన‌టి క‌లెక్ష‌న్స్ దుమ్ము రేపేస్తున్నాయి. ఈ ఫ‌లితం దిల్‌రాజుకు అస్స‌లు మింగుడుప‌డ‌డం లేదుట‌. తాను వ‌ద్ద‌నుకున్న‌ది పెద్ద హిట్ట‌యింది. కావాల‌నుకున్న‌ది పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అందుకే ఈ ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఎవ‌రికి ఏది ఎలా కుదురుతుందో చెప్ప‌లేం. మ‌హాన‌టి కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచి 15కోట్లు వ‌సూలు చేస్తోంది. శాటిలైట్ రూపంలో 11కోట్లు వ‌సూలు చేసింది. అంత‌కుమించి తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద రేంజులో ఆడుతోంది. ఈ ఫ‌లితం దిల్‌రాజు ఊహించ‌నిది. ఎడిట్ టేబుల్‌పై ప‌ని ముగించుకుని, రిలీజ్ ముంగిట ఉన్న వేళ మ‌హాన‌టిని వ‌దులుకున్నారు దిల్‌రాజు.