చిరంజీవితో సినిమా అవాస్తవం : వైజయంతి మూవీస్

Thursday, October 11th, 2018, 10:56:39 PM IST

మెగాస్టార్ తో సినిమా చేయాల్సి వస్తే అది మాకు అత్యంత సంతోషకరమైన విషయం . ఇప్పటికే ఆయనతో సినిమాలు చేసాం .. ప్రస్తుతం మెగాస్టార్ తో మా బ్యానర్ లో సినిమా ఉంటుందంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైజయంతి మూవీస్ అశ్వినీదత్ తెలిపారు. మెగాస్టార్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో అశ్వినీదత్ మాట్లాడుతూ చిరంజీవి కోసం నాగ్ అశ్విని ఓ కథను సిద్ధం చేస్తున్నాడని చెప్పారు ..

అది నిజం అనుకుని ప్రస్తుతం చిరంజీవి సైరా తరువాత ఈ బ్యానర్ లోనే సినిమా ఉంటుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత స్పందించాడు. లేటెస్ట్ గా మహానటి లాంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన ఈ బ్యానర్ లో తాజాగా వచ్చిన దేవదాస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సో మెగాస్టార్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా లేదన్నమాట !!