హీరో కాదు రెమ్యూనరేష్ ముఖ్యమంటున్న కాజల్ ?

Saturday, October 6th, 2018, 10:18:45 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు ప్రస్తుతం క్రేజీ తగ్గింది. కుర్ర హీరోయిన్స్ ఎంట్రీ తో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి .. దాదాపు దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు గ్లామర్ తో పాటు నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు రెండు కోట్ల వరకు పారితోషికం వసూలు చేసిన ఈ అమ్మడికి క్రేజ్ తగ్గడంతో రెమ్యూనరేషన్ బాగా తగ్గించింది. తెలుగు, తమిళ భాషల్లో మల్లి అవకాశాలు పుంజుకోవడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా యాజిటీజ్ గానే పెంచేసింది.

ప్రస్తుతం ఈమెకు 1. 75 కోట్ల పారితోషికం ఇస్తే చాలు .. హీరో ఎవరని కూడా చూడదట .. అతని పక్కన నటించేందుకు రెడీ అంటుంది. ఇప్పటికే కుర్ర హీరోల సరసన కూడా అవకాశాలు వస్తున్నాయి .. కానీ రెమ్యూనరేషన్ అంత ఇచ్చుకోలేమని చెబుతున్నారట నిర్మాతలు. దాంతో ఈ సినిమా చేయనని చెప్పేస్తుందట, తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న కాజల్ ఈ సినిమాకోసం ఏకంగా ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుందట. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. సో ఇకపై కాజల్ హీరోయిన్ గా కావాలంటే అడిగినంత ఇచ్చుకోవలసిందే.