RX 100 హీరో పరిస్థితి ఇప్పుడు ఏంటో..?

Sunday, June 2nd, 2019, 05:54:31 PM IST

ఇక వేసవి ఎలాగో ముగుస్తుంది.ఇప్పటికే వేసవిలో వచ్చిన అన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వారు కూడా ఈ సినిమాలను ఆదరించారు.అయితే ఈ జూన్ నెలలో కూడా కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.వాటిలో RX 100 అనే సినిమాతో మంచి పేరు మరియు గుర్తింపు సంపాదించుకున్న కొత్త హీరో కార్తికేయ నటించిన “హిప్పీ”ఈ జూన్ 6 న విడుదలకు సిద్ధంగా ఉంది.దీనికి ముందే మంచి హిట్ ను అందుకున్నా సరే ఈ సినిమాకు మాత్రమే అది ఏమాత్రం ప్లస్ గా కూడా మారలేకపోయిందనే చెప్పాలి.

ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎదో కొత్తగా ఉంటుంది అని అనుకున్నా ట్రైలర్ చూసేసరికి రొటీన్ స్టోరీ లాగానే ఈ చిత్రం కూడా కనిపిస్తుందని ఇట్టే అర్ధమయ్యిపోతుంది.ఇంకా విడుదలకు నాలుగు రోజుల సమయమే మిగిలి ఉన్నా కూడా ఎక్కడా ఈ చిత్రానికి బజ్ ఏర్పడినట్టు కనిపించడం లేదు.పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవని చెప్పొచ్చు.అసలే ఈ చిత్రాన్ని విదేశాల్లో కూడా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.దీనితో కార్తికేయ పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ఈ సినిమా ఫలితం ఆధారంగా ఉంటుందనే చెప్పాలి.మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.