బాలీవుడ్ సినిమాలే చేస్తానంటున్న జాహ్నవి ?

Wednesday, October 3rd, 2018, 10:53:37 AM IST

అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి హిందీలో ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సీనిమా బాలీవుడ్ బోక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో పలు అవకాశాలు క్యూ కట్టాయి. ముక్యంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమాలో జాహ్నవి నటిస్తుందంటూ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే.

ఈ వార్తలు అటు బాలీవుడ్ లో కూడా వైరల్ అవ్వడంతో జాహ్నవి స్పందించింది. తనకు తెలుగులో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని .. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం హిందీ సినిమాలపైనే ఉందని తెలిపింది. సో జాహ్నవి సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పట్లో లేనట్టే !!