ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ ఇద్దరూ లేనట్టేనా..?

Friday, November 9th, 2018, 06:15:22 PM IST

ఎన్టీఆర్ తెలుగు సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పేరు, తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన మహనీయుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ రక్షకుడు. అలంటి మహానుభావుడి బయోపిక్ అంటే కేవలం సినిమా కాదు, ఒక తరం నాటి తెలుగు సినిమా చరిత్ర అనే చెప్పాలి. పౌరాణికం. సాంఘికం, జానపదం ఇలా అన్ని రకాల కథల్లో విజృంభించి దేశం మొత్తం తన వైపు చూపు తిప్పుకునేలా చేసాడు. ఆయన సమకాలికులు అయిన చాలా మంది నటి నటులతో సత్సంబంధం ఉండేది, ముఖ్యనగ ఏఎన్నార్ తో మంచి స్నేహం, సోదర భావం ఉండేది. ఏఎన్నార్ గురించి చెప్పకుండా ఎన్టీఆర్ బయోపిక్ అసంపూర్ణం అవుతుంది.

ఆ తరువాతి తరంలో వచ్చిన కృష్ణ, శోభన్ బాబులకు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో చోటు దక్కలేదు. ఈ రెండు పాత్రలు స్క్రిప్ట్ దశలో ఉన్నప్పటికీ, ఆ పాత్రలకు సరైన నటులు దొరకని కారణం తో ఆ పాత్రలను సినిమా నుండి తొలగించినట్టు తెలుస్తుంది. మొదట్లో కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు అన్న వార్తలు వచ్చాయి, బాలకృష్ణ కూడా కృష్ణ పాత్రలో మహేష్ అయితేనే బాగుంటుందని భావించారట, అయితే మహేష్ బాబు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాకపోవటం తో కృష్ణ పాత్రని తొలగించారట. కృష్ణ పాత్రే లేనప్పుడు, అంతగా ప్రాధాన్యం లేని శోభన్ బాబు పాత్ర కూడా అవసరం లేదని భావించి తొలగించారట. వీటితో పాటు సూర్యకాంతం, మోహన్ బాబు, కృష్ణం రాజు లాంటి పత్రాలు కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో మరుగున పడిపోయాయి.

  •  
  •  
  •  
  •  

Comments