జీవితకు నాన్ బెయిల్ వారెంట్ జారీ!

Tuesday, December 16th, 2014, 02:37:44 PM IST

jeevatha
నటి.. నిర్మాత జీవితకు సిటీ సివిల్ కోర్ట్ నాన్ బెయిల్ వారెంట్ ను జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఈ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తున్నది. జీవిత ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని చెప్పి పరందామయ్య అనే వ్యక్తీ సిటీ సివిల్ కోర్ట్ లో కేసు దాఖలు చేశారు. కాగ, ఈ కేసుపై విచారణ జరిపిన కోర్ట్ జీవితకు నాన్ బెయిల్ వారెంట్ ను జారీ చేసింది. అయితే.. ఈ వారెంట్ ను తీసుకొని పోలీసులు జీవిత ఇంటికి వెళ్ళగా… ఆమె అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. కాగ.. గతంలో ఇటువంటి కేసులోనే జీవితకు ఎర్రమంజిల్ లోని కోర్ట్ 25లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం విదితమే.