ప్రీమియర్ షో టాక్ : నోటా

Friday, October 5th, 2018, 06:45:43 AM IST


గీత గోవిందం చిత్రంతో 100కోట్ల హీరోగా మారి స్టార్ హీరోల జాబితాలో చేరిన యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రానికి బిలో యావరేజ్ టాక్ వస్తుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈసినిమా కు విజయ్ అంతగా సెట్ అవ్వలేదని సమాచారం. మొదటి భాగం సీరియస్ గా సాగుతూ యావరేజ్ అనిపించగా రెండవ భాగం మాత్రం తేలిపోయింది. సినిమా ఆద్యంతం సీరియస్ గా సాగుతూ గ్రిప్పింగ్ సన్నివేశాలు లేకుండా బోర్ కొట్టించింది అంటున్నారు. ఈచిత్రం తమిళ రాజకీయాలకు దగ్గర ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కూడా కష్టంగా మారిందట. చివరగా ఈనోటా విజయ్ కు నిరాశనే మిగిల్చేలా ఉందట.

ఇక టాక్ ఎలావున్నా కానీ విజయ్ కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా ఈచిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. మరి ఈచిత్రం మొదటి రోజు ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తుందో చూడాలి.