ప్రముఖ సినీ నటుడు కన్ను మూత.!

Monday, June 10th, 2019, 10:10:02 AM IST

సినీ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది.ప్రముఖ సినీ నటుడు మరియు రచయిత అయినటువంటి గిరీష్ కర్నాద్ ఆరోగ్య పరిస్థితులో బాగోలేని నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యి తుది శ్వాస విడిచినట్టు ఇప్పుడు అధికారికంగా వార్త బయటకు వచ్చింది.గిరీష్ కరంద్ తన 81వ ఏట కన్ను మూసారు.గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నో సినిమాలలో ఆయన అద్భుత నటనను కనబర్చారు.ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని ధారావాహికల్లో కూడా కనిపించినట్టు తెలుస్తుంది.ఈయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో “శంకర్ దాదా ఎంబీబీస్” చిత్రంలోనూ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కొమరం పులి” సహా చాలా తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్ర పోషించారు.ఆయన ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబీకులు కన్నీటి పర్యంతానికి లోనయ్యారు.మా తెలుగుఇన్ టీమ్ ఆయన అకాల మరణానికి సంతాపం తెలియజేస్తుంది.