ప్రభాస్ ఈ సారి 1940 ల్లోకి తీసుకెళతాడంట..!

Saturday, October 13th, 2018, 10:08:35 PM IST

“యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్” అనే పేరు కన్నా ఇప్పుడు “బాహుబలి” అంటేనే భారతదేశం అంతటా తెలుస్తుంది.బాహుబలి చిత్రంతో ప్రభాస్ చేసిన విధ్వంసం అలాంటిది మరి..ఆ చిత్రం తర్వాత ప్రభాస్ వెంటనే “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ తో “సాహో” అనే ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా ప్రకటించేశారు.మళ్ళీ ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మళ్ళీ “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇంకో చిత్రాన్ని కూడా మన “డార్లింగ్” ఒప్పేసుకొని షాక్ ఇచ్చాడు.సాహో చిత్రమే ఎప్పుడు విడుదల అవుతుందో తెలీని తికమక పరిస్థితుల్లో అతని అభిమానులు ఉంటే ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి సంబందించిన ఒక వార్త బయటకి వచ్చింది.

రాధాకృష్ణ తో చెయ్యబోయే ఈ చిత్రం పాతకాలం నాటి చిత్రం అని,దాదాపు 1940 వ దశకంలో ఉండేటువంటి చిత్రం అని తెలుస్తుంది.అయితే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఇటీవలే ఇటలీ లో కామో అనే ప్రాంతంలో మొదలయ్యినట్టు తెలుస్తుంది.ఈ చిత్రం పాతకాలం నాటి కథ కావడం మరియు కామో ప్రాంతం కూడా ఇప్పటికీ పాతకాలం నాటి ప్రదేశంగా ఉండడం వల్ల ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.ఇవన్ని పక్కన పెడితే ఎప్పుడో విడుదల కావాల్సిన “సాహో” చిత్రం నుంచి ఒక్క అంశం కూడా బయటకి రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరుత్సాహంగానే ఉన్నారని చెప్పాలి.ఇప్పుడు ఈ వార్త విన్నా సరే నవ్వాలో లేక ఏడవాలో కూడా తెలీని సందిగ్ధంలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.