అభిమాన నటి శ్రీదేవి పార్థివ దేహం తరలింపుకు ఎన్నారై సహాయం…

Wednesday, February 28th, 2018, 04:59:37 PM IST

కొన్ని కోట్ల అభిమాన జన తరంగాల కంటికి చిక్కకుండా ఇంద్రలోకపు సుందరి, నటి శ్రీ దేవి భౌతికకాయాన్ని దుబాయ్ లోని ఒక సాదారణ మార్చరిలో పెట్టారు. ఆమె పార్థివ దేహాన్నిదుబాయ్ నుంచి భారత్ కు పంపడానికి ఓ భారతీయ వ్యక్తి, అభిమాని అయిన అష్రఫ్ అనే వ్యక్తి సాయం చేసాడు. కేరళా నుంచి దుబాయ్ కి వెళ్లి 44 ఏళ్లుగా అక్కడే ఉంటూ, దుబాయ్ లో చనిపోయిన విదేశీయులను తిరిగి వారి స్వదేశాలకు పంపిస్తూ తనకి తోచిన సాయం చేస్తుంటాడు. నటి శ్రీ దేవి మరణానంతరం కావలిసిన అధికారిక పేపర్ వర్క్ ఇతనే దగ్గరుండి పూర్తి చేయించాడు. ఆమె భౌతికకాయాన్ని త్వరగా ఇంటికి పంపేందుకు తనవంతు కృషి చేసాడు. ఇదంతా ఒక్క మన భారతీయుల విషయంలోనే కాదు, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు కూడా దుబాయ్ లో చనిపోతే వారి పార్థివ దేహాన్ని వారి స్వదేశాలకు పంపడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చి నేనున్నానంటూ సహాయం చేస్తాడు. అయితే ఈ ప్రక్రియకు చెందిన పేపర్ వర్క్ తేలిక చాలామంది ఇబ్బందులు పడుతుంటారని, అందుకే తానూ వాళ్లకి సహాయ పడటాని చెప్పారు. ఇదంతా కాగా ఇప్పటివరకు ఆయన 4,700 మృతదేహాలను, 38 దేశాలకు పంపించడానికి సహకరించారు. దుబాయ్మె లోనే కానిక్ షాపు పెట్టుకొని అక్కడే ఉంటూ ఇలాంటి సామాజిక సేవకు దోహద పడుతున్న అష్రఫ్ కు దుబాయి ప్రభుత్వం ఎన్నో ప్రశంసలు, అవార్డులు బహుకరించింది.

దుబాయ్ లో ధనికుడైనా పేదవాడైనా ఒక్కటేనని, మనిషి చనిపోగానే వారి మృత దేహాలను ఆసుపత్రికి తరలించిన వెంటనే కేసు నమోదు పరచి విచారణ జరుపుతారని, దుబాయ్, షార్జా, ఎమిరేట్స్, లాంటి తదితర యూ.ఏ.ఈ. దేశాలలో ఇక్కడైనా ఇదే ప్రక్రియ జరుగుతుందని అష్రఫ్ తెలిపారు. కాగా మంగళవారం కూడా ఆయన 5 మృత దేహాలను వారి స్వంత దేశాలకు తరలించడానికి సాయం చేశారని వెల్లడించారు. అందులో భారత నటి శ్రీదేవి కూడా ఉన్నారు. సెలెబ్రిటి అయినందువల్ల నటి శ్రీదేవి మరణించిన వెంటనే భారత ప్రభుత్వం వారు ఆమె పాస్ పోర్టును సిజ్ చేసి మిగితా ప్రక్రియకి కావలిసిన పత్రాలను సిద్దం చేసారు. కాగా పోలిస్ క్లియరెన్స్ పత్రం రిలీజ్ చేయడం ఆలస్యం కావడం వల్ల శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు పంపడం ఆలస్యం అయిందని, తనకు ఈ విషయమై పత్రికా జర్నలిస్టులు, మీడియా ప్రతినిదులు, అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ క్లియరెన్స్ పూర్తి అవ్వ్హ్గానే శ్రీ దేవి భౌతికకాయాన్నిమార్చరికి తరలించారని వివరించారు. ఆమెకు ఎంబామింగ్ చేస్తుండగా అష్రఫ్ మిగితా వర్క్ అంతా పూర్తి చేసి వెనువెంటనే ఆమె పార్థివ దేహాన్ని అనిల్ అంబాని సిద్దం చేసిన ఓ ప్రైవేట్ జెట్టులో భారత్ కు తరలించారని తెలిపారు. ఇన్ని అడ్డంకులలో కూడా దుబాయి ప్రభుత్వం వీలైనంత త్వరలో అన్ని ప్రక్రియలను పూర్తి చేసి భారత్ కు శ్రీదేవి భౌతికకాయాన్ని పంపిందని దానికి అష్రఫ్ కూడా దుబాయి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

ఎన్ని చెప్పుకున్న అ దివి తార ఇక తిరిగి రాదు. ఇలాంటి సామాజిక స్పృహతో పరులకు సాయం చేస్తున్న అష్రఫ్ లాంటి మనుషులుండటం నిజంగానే అరుదు.

  •  
  •  
  •  
  •  

Comments