ఎన్టీఆర్ 30 వ చిత్రం పై పెరుగుతున్న అంచనాలు!

Sunday, April 11th, 2021, 08:00:57 PM IST

జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం అనే చిత్రం లో కోమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఏ దర్శకుడి తో సినిమా చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అని తెలిసినప్పటికీ కొన్ని కారణాల వలన దాని పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే జనతా గ్యారేజి అంటూ కొరటాల శివ ఎన్టీఆర్ కి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల తో ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇటు ప్రశాంత్ నీల్ మరియు అట్లీ తో పాటుగా, ఉప్పెన చిత్రం తో తొలి హిట్ కొట్టిన బుచ్చిబాబు తో సైతం ఒక సినిమా ఉండనుంది అని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ 30 వ సినిమా ఎవరితో చేస్తారు అనే దాని పై రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. అయితే దీని పై రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అంతా కూడా కొరటాల లేదా త్రివిక్రమ్ తో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.