ట్రిపుల్ ఆర్ వాటాల్లో… ఎవరికెంత ?

Thursday, October 25th, 2018, 11:15:53 AM IST

మెగా హీరో .. నందమూరి హీరో కలిసి ఓ మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నారన్న వార్త గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ట్రెండ్ గా మారింది. బాహుబలి లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి రూపొందించే ఈ సినిమా పై రోజుకో కొత్త న్యూస్ మీడియాల్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు వందరోజులకు పైగా కాల్షీట్స్ ని ఇచ్చేశారట. వచ్చే నెల చివర్లో వర్క్ షాప్ లో కూడా పాల్గొననున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ హాట్ న్యూస్ బయటికి వచ్చింది అందేమిటంటే ఈ సినిమాకోసం ఈ ఇద్దరు హీరోలు .. రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా అడిగారట ? ఈ మధ్య హీరోలు .. రెమ్యూనరేషన్ బదులు కొన్ని ఏరియాలు తీసుకోవడం .. లేదా రెమ్యూనరేషన్ బదులు లాభల్లో వాటా అడగడం కామన్ గా మారింది .. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా లాభాల్లో వాటా అడిగారని టాక్ . ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలకు మంచి క్రేజ్ ఉంది .. ఇద్దరు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు . రెమ్యూనరేషన్ అయితే అంతే వస్తుంది కానీ లాభాల్లో వాటా అయితే చెప్పక్కరలేదు .. అదే ప్లాన్ తో వీళ్ళు ఉన్నారట. ఎలాగూ రాజమౌళి కి వాటా ఉంటుంది .. మరి ఎవరి వాటా ఎంత అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

  •  
  •  
  •  
  •  

Comments