బాబాయ్ అబ్బాయ్ క‌లిసిపోతున్నారు!

Thursday, November 10th, 2016, 09:29:13 PM IST

balayya-ntr
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం ఇప్ప‌టివ‌ర‌కూ సాగింది. అయితే ఇక‌ముందు అందుకు ఛాన్స్ లేద‌ని చెబుతున్నారు. బాబాయ్ – అబ్బాయ్ క‌లిసిపోతున్నారు. అందుకు తాజా ప‌రిణామాలే ఎగ్జాంపుల్ అంటూ చెబుతున్నారు. ఇటీవ‌లే రిలీజైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన ఎన్టీఆర్ బాబాయ్ ఒక రేంజులో పొగిడేశాడు. శాత‌క‌ర్ణి టీజ‌ర్ అద్భుతం అంటూ కితాబిస్తూనే ఈ సినిమా చూసేందుకు తాను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నాడు.

అంటే బాబాయ్‌కి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఎన్టీఆర్ ప‌క్కా ప్లాన్‌తో ఉన్నారు. అలాగే సామాజిక మాధ్య‌మాల ద్వారా ఎన్టీఆర్ పొగ‌డ్త బాల‌య్య చెవిన ప‌డిందిట‌. దీంతో బాల‌య్య‌బాబు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ఎన్టీఆర్ సినిమాకి బాబాయ్‌ని ఆహ్వానించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. అంతేకాదు .. వీలైతే శాత‌క‌ర్ణి ప్రివ్యూషోని బాబాయ్‌తో క‌లిసే చూసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడుట‌. మ‌రి తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బాబాయ్‌- అబ్బాయ్ ఒక‌ట‌వుతారంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇది మంచిదే. నంద‌మూరి అభిమానుల‌కు థ్రిపుల్ ధ‌మాకా. సంక్రాంతికి శాత‌క‌ర్ణి చూడొచ్చు. బాబాయ్ అబ్బాయ్ క‌లిసి సినిమా చూడ‌డాన్ని వీక్షించ‌వ‌చ్చు. అంతిమంగా ఆ ఇద్ద‌రూ క‌లిసి తెలుగు సినిమా రికార్డుల్ని తిర‌గ‌రాసే వైనం చూడొచ్చు.. అంటూ నంద‌మూరి అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డ‌మే ఆల‌స్యం.