ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిందిగా..!

Sunday, January 26th, 2020, 02:00:22 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో తాజాగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ కు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆయన తీసిన సినిమాలలో ఎక్కువ సినిమాల టైటిల్స్ ‘అ’ అనే అక్షరంతోనే మొదలయ్యాయి. అయితే గతంలో త్రివిక్రమ్ ఎన్‌టీఆర్‌తో కలిసి చేసిన సినిమా పేరు అరవింద సమేత వీర రాఘవ.

అయితే ఇప్పుడు కొత్తగా తీయబోయే సినిమాకి కూడా ‘అ’ తోనే మొదలయ్యే టైటిల్ ని ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫుల్ మాస యాంగిల్ లో కాకుండా పూర్తి స్థాయి వినోద భరితంగా ఈ సినిమాని తెరకేక్కిస్తున్నారట. అయితే జంధ్యాల మార్క్ సినిమాలగా ఈ సినిమా కూడా ఉండబోతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో పాండవులతో సంధి కుదరకపోయినా ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే తిక్కన్న మహాభారతంలో వాడిన పదజాలం ఎంతో ప్రఖ్యాతి పొందింది. అయితే అదే పదజాలాన్ని తీసుకుని త్రివిక్రమ్ ఎన్‌టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.