ఎన్టీఆర్ ఆ నిర్ణ‌యం తీసుకోక‌పోయి ఉంటే?

Tuesday, April 24th, 2018, 01:45:50 AM IST

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ‌.. న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌమ‌.. అన్న‌గారు, స్వ‌ర్గీయ‌ నంద‌మూరి తార‌క‌రామారావు ఆనాడు రాజ‌కీయాల్లోకి రావాల‌న్న నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌పోయి ఉంటే.. తెలుగు దేశం పార్టీని స్థాపించ‌క పోయి ఉంటే…? ఈ ఊహే ఊహాతీతం క‌దూ? అస‌లు తెలుగువాడి ఘ‌న‌త ఈ స్థాయిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలిసే అవ‌కాశం ఉండేదా? తేట తెలుగు వెలుగుజిలుగులు ఆ స్థాయిలో ప్ర‌స‌రించే ఆస్కారం ఉండేదా? కేంద్రం న‌డ్డి విరిచే ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భ‌వించి ఉండేదా? తార‌క రాముని అభిమానుల్లో ఎప్ప‌టికీ ఇదో ఫ‌జిల్ లాంటి ప్ర‌శ్న‌. అలాంటి కీల‌క నిర్ణ‌యం ఎన్టీఆర్‌ తీసుకున్న‌ది ఎప్పుడో తెలుసా?

ఇదిగో ఈ హిస్ట‌రీ తెలుసుకుంటే చాలు! `సర్దార్ పాపారాయుడు` చిత్రంలోనిది ఈ స్టిల్. బ్రిటీష్ కాలంనాటి విప్లవయోధుడిగా నటించిన ఎన్టీఆర్, ఈ సీన్లో సింహంలా ఒక్కో మెట్టు దిగుతూ డైలాగులు చెబుతుంటే.. ఆనాడు థియేటర్లలో ఒకటే చప్పట్లు, ఈలలు. ఈ సినిమా షూటింగ్ లోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్ర‌మంలోనే తెలుగు దేశం పార్టీ ఆవిర్భ‌వించింది. అటుపై చ‌రిత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తార‌క‌రాముని అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో విస్త్ర‌తంగా షేర్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments