ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరింది .. క్రిష్ స్టైల్ లోనే ?

Monday, June 11th, 2018, 12:12:22 AM IST

మహానటుడు అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ కి మళ్ళీ కొత్త ఊపొచ్చేసింది. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న సందేహాలు ఏర్పడ్డాయి .. కానీ స్థానంలోకి క్రిష్ ఎంటర్ ఇవ్వడంతో ఈ సినిమా వేగం పుంజుకుంది. తాజాగా ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ క్రిష్ స్టైల్ లోనే అదిరిందంటూ నందమూరి అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ తన తనయుడు బాలయ్యకు మేకప్ వస్తున్నా ఫోటో తో పాటు .. ఎన్టీఆర్ పలు గెటప్స్ ఈ పోస్టర్ లో డిజైన్ చేసారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.