షాక్ … రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ ?

Wednesday, October 3rd, 2018, 10:45:55 AM IST

అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బాలయ్యే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ నెల 4 నుండి శ్రీకాకుళంలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు క్రేజీ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ అవుతుంది. అదేమిటంటే .. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.

ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా 60 గెటప్స్ వరకు కనిపిస్తాడని, కథ కూడా కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం కుదరదని భావించిన మేకర్స్ రెండు భాగాలుగా చేస్తే అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ , ఫస్ట్ లుక్స్ కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడం .. అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.