రామ్ గోపాల్ వ‌ర్మ షాక్ అయ్యే విధంగా.. క్రిష్ అదిరిపోయే స్కెచ్‌..!

Wednesday, October 24th, 2018, 01:19:37 PM IST

టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి.. ప్రస్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ఎంట్రీ త‌ర్వాత ఎన్టీర్ బ‌యోపిక్ ప్రాజెక్ట్ రూప రేఖ‌లే మారిపోయాయి. దీంతో రెండు పార్టులుగా రిలీజ్ చేయ‌నున్నారు ఈ చిత్రాన్ని. మొద‌టి భాగం – క‌థానాయ‌కుడు, రెండ‌వ‌భాగం -రాజ‌కీయ‌నాయ‌కుడుగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ప్లాన్ చేశారు డైరెక్ట‌ర్ క్రిష్‌.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిసిటీ స్టంట్స్‌లో మాస్ట‌ర్ అయిన వ‌ర్మ ఎన్టీఆర్ జీవితం మొత్తంలో కాంట్ర‌వ‌ర్సిటీ పాయింటునే ఎంచుకొని మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఎన్టీఆర్ లైఫ్‌లో సినిమా,రాజ‌కీయాలు త‌ర్వాత అత్యంత ఆశ‌క్తిక‌ర‌మైన అంశం ల‌క్ష్మీపార్వ‌తి.. దీంతో అదే పాయింటును ప‌ట్టుకొని మ‌రోసారి అంద‌రి దృష్టి త‌న‌వైపు తిప్పుకున్నాడు వ‌ర్మ‌.

అయితే క్రిష్ కూడా నేనేం త‌క్కువ తిన‌లేద‌నే విధంగా రోజుకో పోస్ట‌ర్ వ‌దులులూ సీనిమా పై ఆశ‌క్తి పెంచేస్తున్నారు. మొద‌ట ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్న బాల‌య్య పోస్ట‌ర్ల‌ను విడుద‌ల‌న చేసిన క్రిష్..ఆ త‌ర్వాత కూడా ఈ చిత్రం పై హైప్ క్రియేట్ చేస్తూ.. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా స్టిల్‌ని వ‌దిలాడు. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా క‌రెక్ట్‌గా సెట్ అవ‌డంతో మ‌రోసారి అంచ‌నాలు పెంచేశాడు క్రిష్‌. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో స్టిల్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

ఎన్టీఆర్ అల్లుడు పుంధేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర రావు పాత్ర‌లో న‌టిస్తున్న భ‌ర‌త్ స్టిల్‌ని రిలీజ్ చేయ‌గా.. విప‌రీత‌మైన పాజిటీవ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక త‌ర్వాత కూడా ఇత‌ర పాత్ర‌ల‌కు సంబంధించిన ఒక్కో స్టిల్స్‌ని క్రిష్ ద‌గ్గ‌రుండి డిజైన్ చేయిస్తున్నాడ‌ట‌. వాటిని కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. దీంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ వ‌ర్మ చేస్తున్న హంగామా త‌ట్టుకోవ‌డాని క్రిష్ స‌ప‌రేట్ స్ట్రాట‌జీని వాడుతున్నార‌ని.. అందులో భాగంగానే ఒక్కో ఇంట్ర‌స్టింగ్ పాత్రల‌ స్టిల్స్‌ని విడుద‌ల చేసి.. ఎన్టీఆర్ బ‌యోపిక్ పై హైప్ క్రియేట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ‌కి క్రిష్ షాక్ ఇస్తున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments