హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ నీ డామినేట్ చేస్తున్న ఎన్టీఆర్!

Tuesday, March 31st, 2020, 12:30:25 AM IST

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో ఎలివేషన్ కోసం వాయిస్ ఓవర్ అనేది కీలకం అయింది. ప్రతి స్టార్ హీరో సినిమా కి ఈ మద్యన ఇంకా మామూలు అయిపోయింది. అయితే తన అన్న మెగాస్టార్ చిరంజీవి సై రా నరసింహ రెడ్డి కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ వాయిస్ ఓవర్ పై గతేడాది సోషల్ మీడియా లో పోస్టులతో ఈ విషయం వైరల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ వాయిస్ అంతగా ఆకట్టుకోలేదు అని విమర్శ లు వచ్చాయి. సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపలేకపోయింది.

అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న రౌద్రం రణం రుదీరమ్ అనే చిత్రం నుండి భీమ్ ఫర్ రామరాజు అంటూ ఒక వీడియో నీ విడుదల చేసింది. అయితే ఈ వీడియో లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ పై సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే ఇపుడు ఈ విషయంలో ఎన్టీఆర్ నీ పవన్ తో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ వాయిస్ కంటే ఎన్టీఆర్ వాయిస్ సూపర్ అంటూ, మెగా హీరో కి ఎన్టీఆర్ వాయిస్ అడ్డిరిపాయింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.