మహేష్ ట్వీట్ పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఏమయ్యింది..?

Wednesday, November 7th, 2018, 08:43:25 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ వచ్చిన “స్పైడర్” చిత్రం ఘోర పరాజయం అయిన సంగతి తెలిసినదే.అయితే ఆ చిత్ర సమయంలో అభిమానుల మధ్య పెద్ద దుమారమే చెలరేగింది.అయితే ఆ తర్వాత మహేష్ మరియు తారక్ లు “భరత్ అనే నేను” చిత్రానికి ఒకే స్టేజి మీద కనబడి అభిమానులకు ఒక చక్కటి దిశా నిర్దేశం చేశారు.అక్కడి వరకు అంతా బాగానే ఉంది,ఆ తర్వాత మహేష్ పుట్టిన రోజున తారక్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇది కూడా ఓకే కానీ ఈ రోజు మహేష్ పెట్టినటువంటి ట్వీట్ వల్ల తారక్ అభిమానులు తమ నిరసనను సోషల్ మీడియాలో వెళ్లబుచ్చుకుంటున్నారు.

మురుగదాస్ మరియు దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ”సర్కార్” చిత్రం ను ఉద్దేశించి మహేష్ ఒక ట్వీట్ పెట్టారు.ఇప్పుడు ఆ ట్వీట్ ను ఉద్దేశించి తారక్ అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు,అప్పుడేమో మేము మేము బాగానే ఉంటాం అని అన్నారు,ఇప్పుడు సర్కార్ చిత్రానికి అభినందనలు తెలిపినట్టుగా “అరవింద సమేత” చిత్రానికి చెప్పడానికి ఎందుకు మనసు రాలేదని ప్రశ్నిస్తున్నారు.తారక్ మీ పుట్టిన రోజుకి అభినందనలు తెలిపినా మీరు బదులు చెప్పరు..దీన్ని మేము ఏమని అనుకోవాలని సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తే మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.