ఎన్టీవోడి ప్ర‌చారార్భాటం షురూ

Friday, October 12th, 2018, 12:07:26 AM IST

ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు రెండు భాగాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ‌వుతోంది.ఎన్‌బికే ఫిలింస్ అధినేత‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌- క్రిష్ ఎంతో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఈ చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌వ‌న‌రి 9న – క‌థానాయ‌కుడు, రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న – మ‌హానాయకుడు చిత్రాల్ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ సినిమాల మార్కెటింగ్‌ స్ట్రాట‌జీ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఈ రెండిటి ప్ర‌చారంలోనూ అదే ఒర‌వ‌డి అనుస‌రిస్తున్నారు. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా ఈ రెండు భాగాల‌కు ఒకే పెట్టుబ‌డితో రెండు ర‌కాలుగా ప్ర‌చారం సాగిస్తున్నారు. ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ తొలివారంలో రెండు సినిమాల‌ టీజ‌ర్ల‌ను రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. దీపావ‌ళి రోజున‌ టీజ‌ర్ రిలీజ్ అని ప్ర‌క‌టించారు. ఆరోజు టైమ్ ఎపుడో త‌ర్వాత చెబుతార‌ట‌. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌య్య‌- క్రిష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాలుగా క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల‌కు క్రేజు నెల‌కొంది. 2019 ఆరంభ నెల‌ బాల‌య్య‌కు బాగానే క‌లిసి రానుంద‌ని విశ్లేషిస్తున్నారు.