లేటెస్ట్ అప్డేట్: అల్లు అర్జున్ దిమ్మతిరిగే స్ట్రాటజీ…ఎన్టీఆర్ బరిలోకి…

Tuesday, December 10th, 2019, 10:42:01 PM IST

ఇప్పటివరకు ఎన్టీఆర్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న అలా వైకుంఠపురంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచినట్లు సమాచారం. అయితే దీనికి ఎన్టీఆర్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్- జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సత్సంబంధాలు ఉండటం కూడా ఒక కారణం అని తెలిసింది.

అయితే ఈ సంక్రాంతి బరిలో నందమూరి సినిమాలు ఏమి లేవు. అందుచేత ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం వుంది. హిట్ కోసం చూస్తున్న అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ అభిమానులు కూడా తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్లను వేగం చేసింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.