ఈ విషయానికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారుగా!

Tuesday, December 10th, 2019, 07:40:40 PM IST

రాజమౌలి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇంత వరకు ఏ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో హైలెట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజులు గా ఈ చిత్రం లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయమైన వెంటనే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. .

అయితే ఎన్టీఆర్ షూటింగ్ నిమిత్తం వైజాగ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అయితే అక్కడ అభిమానులు తారక్ ఫోటోలు, వీడియోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత చిన్న విషయానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా రచ్చ చేస్తున్నారంటే ఇక టీజర్ విడుదల అయ్యాక వీరి అభిమానం ఇంకా వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. రాజమౌళి చేస్తున్న పనికి అభిమానులు ఎన్టిఆర్ ని ఇలా చూసి మురిసిపోతున్నారు.