RRR షూటింగ్ లో తిరిగి పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నా!

Thursday, November 5th, 2020, 08:30:03 AM IST

దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధీరం చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఫుల్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి సంబంధించిన టీజర్ లు సైతం చిత్రం యూనిట్ విడుదల చేసింది. అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ టీజర్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. వారిని చూపించడం లో జక్కన్న స్టైల్ కి ఫిదా అవుతున్నారు.

అయితే ఈ చిత్రం లో బాలీవుడ్ భామ అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన నటిస్తున్నారు. అయితే ఈ మేరకు ఒలివియా మోరిస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం ఆర్. ఆర్. ఆర్. షూటింగ్ కోసం ఇండియా వచ్చా అని, అయితే షూటింగ్ లో తిరిగి పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నా అని తెలిపారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణం గా వాయిదా పడిన చిత్ర షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా బాలీవుడ్ నటులతో సహ, ఒలివియా మోరిస్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.