ఈ “సాహో” మేకర్స్ కి ఒక దణ్ణం..ప్రస్ట్రేటెడ్ ప్రభాస్ ఫ్యాన్స్.!

Sunday, August 18th, 2019, 05:01:33 PM IST

ఒక పక్క సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డార్లింగ్ అభిమానులు అంతా ఎంతగానో ఎదురు చూస్తుంటే మరికొంత మంది మాత్రం ఈ సినిమా మేకర్స్ పై మండిపడుతున్నారు.ఈ చిత్రం ఇప్పటికే మొదలయ్యి రెండేళ్లు గడిచింది.మొదట్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అని అభిమానులు నిరాశతో ఉండగా ప్రభాస్ పుట్టిన రోజున ఒక పోస్టర్న్ ను విడుదల చేసారు.దానితో అభిమానులు ఎంతో ఆనందపడ్డా ఆ పోస్టర్ ఒక హాలీవుడ్ సినిమా నుంచి లేపేసారని ఒరిజినల్ పోస్టర్ను పెట్టి తేల్చేసారు.ఇక అక్కడ నుంచి పోస్టర్ల విషయంలో ప్రభాస్ అభిమానులను దరిద్రం నీడలా వెంటాడుతూనే ఉంది.

వీరు విడుదల చేసిన ప్రతీ ఒక్క పోస్టర్ మొదట్లో కొత్తగా అనిపించినా దాని ఒరిజినల్ చూసేసరికి ప్రభాస్ అభిమానులకు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కావడం లేదు.ఎన్నిసార్లని తమ అభిమాన హీరో సినిమాను తప్పులను కవర్ చేసుకుంటూ వస్తారు.ఒకటి రెండు సార్లు అంటే ఓకే కానీ అప్పటి నుంచి ఈ రోజు తాజాగా విడుదల చేసిన పోస్టర్ వరకు అన్ని కాపీయే అయితే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండదా?ఈరోజు విడుదల చేసిన పోస్టర్ కూడా అచ్చు గుద్దినట్టు ఓ బాలీవుడ్ సినిమాలోది అని రెండు పక్కన పెట్టి మరీ నెటిజన్లు చూపిస్తుండగా ప్రభాస్ అభిమానులకు ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.అయినా ఇంత నిర్లక్ష్యంగా చిత్ర యూనిట్ ఎలా ఉన్నారో మరి.