“సాహో” సినిమా ఎలా ఉండబోతుందో పోస్టరే చెప్తుందా?

Wednesday, June 12th, 2019, 07:18:43 PM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఆనందంగా ఉన్న వారు మరొకరు లేరని చెప్పాలి.వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు కోసం ఇప్పుడు గడియారంలో నిముషాలు చూసుకుంటున్నారు.ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సాహో” భారతీయ ఇండస్ట్రీలోనే మరో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతుంది.ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి,ఎలాగో పెద్ద చిత్రం వెండి తెరపై ఎలా ఉండబోతుందా అని అంతా అనుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ భారతదేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని చెప్పారు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్లను కూడా ఎక్కువగా యాక్షన్ సీన్స్ కు సంబంధించినవే వదులుతున్నారు.దీనిని బట్టి సినిమా మొత్తంలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పటికే ఈ చిత్రానికి హాలీవుడ్ మరియు బాలీవుడ్ కు చెందిన టాప్ మోస్ట్ స్టంట్ మాస్టర్స్ ను సుజీత్ నియమించారు.దీనితో సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో హైలైట్ గా నిలబోతున్నాయో చెప్పొచ్చు. ఇక అసలు ఏక్షన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల 23 నిమిషాల వరకు ఆగాల్సిందే.