దిల్ రాజు మాట కాదంటున్న మహేష్

Saturday, October 27th, 2018, 06:03:54 PM IST

దిల్ రాజు బ్యానర్ పై 2019లో వచ్చిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ టాక్ కైవసం చేసుకోలేక పోయాయి, దిల్ రాజు కెరీర్ లో 2019 సంవత్సరం నిరాశాజనకంగా ఉండబోతుందా అన్న అనుమానం వస్తోంది. అయితే దిల్ రాజు ఆశలన్నీ తన తదుపరి చిత్రం మహర్షి మీదనే పెట్టుకున్నాడు, ఈ సినిమా ని ఎలాగైనా హిట్ చేసి తీరాలన్న కసితో ఉన్నాడట.

వివరాల్లోకి వెళితే మహర్షి సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమా లో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయట, ఎమోషనల్ కంటెంట్, కామెడీ, రొమాన్స్ ప్రధానంగా సాగే ఈ కథ లో ఫైట్స్ పెద్దగా స్కోప్ లేదట. కాకపోతే దిల్ రాజు దర్శకుడు వంశి పైడిపల్లి ని ఉన్న రెండు ఫైట్లకి తోడు గా మరో రెండు ఫైట్లు జోడించమని ఒత్తిడి చేస్తున్నారంట. సాధారణంగా కుటుంబ కథలకు తప్ప, యాక్షన్ బేస్డ్ కథల వైపు మొగ్గు చూపని దిల్ రాజు ఇలా వంశి మీద ఇలా ఒత్తిడి తేవడానికి వెనక బలమైన కారణమే ఉందట.

దిల్ రాజు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ పై రూ. 25 కోట్లు ఆశిస్తున్నాడట, అలా మరో రెండు ఫైట్లు పెట్టమని అడగటానికి కారణం ఇదేనట. ఎందుకంటే దిల్ రాజు హిందీ డబ్బింగ్ రైట్స్ మీద ఆశిస్తున్న రేటు పలకాలంటే సినిమా లో యాక్షన్ కంటెంట్ ఉంటేనే సాధ్యం అట. మాస్ యాక్షన్ సినిమాలకు హిందీ లో మాంచి గిరాకీ ఉంది అందుకే దిల్ రాజు ఈ ప్రపోసల్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇందులో ఇంకో రెండు ఫైట్లు పెట్టేందుకు సుముఖంగా లేరట. స్క్రిప్ట్ ప్రకారం ఉన్న రెండు ఫైట్లు చాలని, కొత్తగా మరో రెండు ఫైట్లు పెట్టడం సరికాదని అంటున్నాడట. ఈ విషయం ఫై దిల్ రాజు, వంశి, మహేష్ ల మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తుందని సమాచారం. త్వరలోనే ఈ విషయం పై ఓ నిర్ణయానికి రావాలని ఆశిస్తున్నారట.