ఆస్కార్స్ 2020 : వరించిన విజేతలు వీళ్ళే!

Monday, February 10th, 2020, 09:04:25 AM IST

ఆస్కార్ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ప్రారంభమైంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నా సినీ అభిమానులకు ఇది పండుగ కంటే ఎక్కువ అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన సినిమాలు ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచాయి. జోకర్ మరియు 1917 చిత్రాలు ఎక్కువ నామినేషన్లతో టాప్ లో ఉన్నాయి.

2020 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విజేతలు:

బెస్ట్ డైరెక్టర్–ఈ కేటగిరిలో పారసైట్ చిత్రానికి గానూ బోన్ జోన్ హో అవార్డు ని గెలుపొందారు. 

బెస్ట్ యాక్టర్ –ఈ కేటగిరిలో జోకర్ చిత్రానికి గానూ జాక్విన్ ఫోనిక్స్ అవార్డు ని గెలుపొందారు. 

బెస్ట్ యాక్ట్రెస్–ఈ కేటగిరిలో జూడి చిత్రానికి గాను రేని జెల్ వెగర్ అవార్డు ని గెలుపొందారు.

బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిలిం–ఈ కేటగిరిలో లెర్నింగ్ టు స్కేట్ బోర్డు ఇన్ వార్జోన్ (ఇఫ్ యు ఆర్ ఆ గర్ల్) షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకుంది.

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ –ఈ కేటగిరిలో బాంబ్ షెల్ చిత్రానికి గానూ అవార్డుని గెలుచుకున్నారు. 

బెస్ట్ మ్యూజిక్–ఈ కేటగిరిలో జోకర్ చిత్రానికి గానూ హిల్డార్ అవార్డుని గెలుపొందారు. 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్–ఈ కేటగిరిలో రాకెట్ మాన్ లోని లవ్ మీ అగైన్ కు అవార్డు లభించింది.

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం–ఈ కేటగిరిలో పారసైట్ అవార్డుని గెలుపొందింది. మొట్టమొదటిసారి ఆస్కార్ చరిత్రలో ఒక నాన్ ఇంగ్లీష్ చిత్రం అవార్డు ని గెలుపొందింది.

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్–ఈ కేటగిరిలో ఫోర్డ్ వెర్సెస్ ఫెరారీ చిత్రానికి గానూ డోనాల్డ్ సిల్వెస్టర్ అవార్డుని గెలుపొందారు.

బెస్ట్ సినిమాటోగ్రఫీ–ఈ కేటగిరిలో 1917 చిత్రానికి గానూ రోజర్ డికెన్స్ అవార్డు ని గెలుపొందారు.

బెస్ట్ ఫిలిం ఎడిటింగ్– ఈ కేటగిరిలో ఫోర్డ్ వెర్సెస్ ఫెరారీ చిత్రానికి గానూ మైకేల్ మెక్సుకర్ మరియు ఆండ్రూ బక్లాండ్ అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్–ఈ కేటగిరిలో 1917 చిత్రానికి గానూ రోచ్ రాన్, గ్రెగ్ బట్లర్, డొమినిక్ తువే అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ మ్యూజిక్–ఈ కేటగిరిలో జోకర్ చిత్రానికి గానూ హిల్డార్ అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్– ఈ కేటగిరి లో లిటిల్ విమన్ చిత్రానికి గానూ జాక్వలిన్ దురన్ అవార్డుని గెలుచుకున్నారు.

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం– ఈ కేటగిరిలో ది నైబర్స్ విండో అవార్డు ని గెలుపొందింది.

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం–ఈ కేటగిరిలో హెయిర్ లవ్ చిత్రం అవార్డుని గెలుపొందింది.

బెస్ట్ సౌండ్ మిక్సింగ్– ఈ కేటగిరిలో 1917 చిత్రానికి గానూ మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్ అవార్డులు గెలుపొందారు.

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ — ఈ కేటగిరి లో వన్స్ అపాన్ ఆ టైం ఇన్ హాలీవుడ్ చిత్రానికి గానూ బ్రాడ్ పిట్ అవార్డు ని గెలుపొందారు.

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ — ఈ కేటగిరి లో లారా డెర్న్, మ్యారేజ్ స్టోరీ చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ని గెలుపొందారు.

బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్– ఈ కేటగిరిలో అమెరికన్ ఫ్యాక్టరీ అవార్డును గెలుచుకొంది.

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్–ఈ కేటగిరిలో వన్స్ అపాన్ ఆ టైం ఇన్ హాలీవుడ్ చిత్రానికి గానూ బార్బరా లింగ్ కి అవార్డు లభించింది.

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే– ఈ కేటగిరిలో జో జో రాబిట్ చిత్రానికి గానూ తైకా వైటిటి కి అవార్డు లభించింది.

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే–ఈ కేటగిరిలో పారసైట్ చిత్రానికి గానూ బోంగ్ జూన్ హో మరియు జిన్ వన్ హాన్ అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం–ఈ కేటగిరి లో టాయ్ స్టోరీ 4 చిత్రం అవార్డుని గెలుపొందింది.