విశ్వక్ సేన్ కు షాకిచ్చిన ఉస్మానియా విద్యార్థులు.!

Wednesday, June 5th, 2019, 06:12:41 PM IST

తెలుగు సినీ తెర మీదకు వచ్చిన హీరోల్లో సంచలనం రేపిన వారిలో విజయ్ దేవర కొండ ఒకరు.అలా విజయ్ కు చెక్ పెట్టే హీరోలా మరో సరికొత్త హీరో తెలుగు తెరకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు.అతనే విశ్వక్ సేన్.తన మొట్టమొదటి సినిమా అయినటువంటి “ఫలక్ నామా దాస్” చిత్రంతోనే దర్శకునిగా మరియు హీరోగా ఎంట్రీ ఇచ్చి టీజర్ మరియు ట్రైలర్లతోనే సంచలనం రేపారు.అలాగే ఎన్నో వివాదాలు కూడా ఈ చిత్రంతో నమోదు చేసుకున్నారు.

తాజాగా విశ్వక్ మరో వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది.ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.అలా ఉస్మానియా విద్యార్థిగా కనిపించి బూతులను డైలాగులుగా పెట్టాడని అక్కడి విద్యార్థులు విశ్వక్ ఆఫీస్ ను చుట్టు ముట్టారట.అంతే కాకుండా తమ యూనివర్సిటీ పరువు తీశావంటూ అక్కడే ధర్నాకు కూడా పాల్పడి విశ్వక్ కు మొట్ట మొదటి సినిమాతోనే గట్టి షాకిచ్చినట్టు తెలుస్తుంది.