ఆన్‌లైన్‌లో `పద్మావ‌త్‌` క్లాసిక్‌?

Sunday, April 15th, 2018, 10:32:14 PM IST

రెండేళ్లుగా `ప‌ద్మావ‌త్ -3డి` గురించి అనునిత్యం ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. వివాదాలు ఓవైపు, రికార్డులు మ‌రోవైపు అట్టుడికించాయి. అంత‌కుమించి ఈ సినిమా రిలీజై ప్రేక్ష‌క‌దేవుళ్ల మ‌న‌సు దోచింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇలాంటి వేరొక సినిమా రానేలేద‌ని అంతా మాట్లాడుకున్నారు. రాణీ ప‌ద్మావ‌తి పాత్ర‌లో దీపిక అభిన‌యం, ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్‌, ర‌త‌న్‌సింగ్ రావ‌ల్ పాత్ర‌లో షాహిద్ న‌ట‌న అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చింది. ఫ్యామిలీ స‌మేతంగా వీక్షించ‌ద‌గిన ఎమోష‌న‌ల్ డ్రామా సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. అందుకే ఈ సినిమా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసింది.

అయితే ప‌ద్మావ‌త్ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో వీక్షించ‌లేక‌పోయిన వారికి.. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత డిజిట‌ల్ దిగ్గ‌జం అమెజాన్ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్ల కోసం ఉచితంగా ఈ సినిమాని అందిస్తోంది. ఇప్ప‌టికే లైవ్‌లోకి వ‌చ్చేసింది. రిలీజైన కేవ‌లం రెండే రెండు నెల‌ల్లో ఇలాంటి గ్రేట్ మూవీ మొబైల్‌లో చూసుకునే వెసులుబాటు వ‌చ్చేసిందంటే ఎవ‌రైనా వ‌దులుతారా? చ‌క‌చ‌కా అమెజాన్ ప్రైమ్‌లో మెంబ‌ర్‌షిప్ తీసుకుని, వెంట‌నే చూసేస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments