వామ్మో పాక్ నటి తిట్లు..సల్మాన్ చీప్ నటుడు,ముద్దు పెడితే క్యాన్సర్ వస్తుంది..!

Thursday, February 16th, 2017, 09:41:21 PM IST


పాక్ నటి సబా బాలీవుడ్ స్టార్ లు టార్గెట్ గా తిట్ల దండకం మొదలెట్టింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన పార్థి హీరోయిన్ సల్మాన్ ఖాన్ పక్కన నటించాలనుకుంటారు. కానీ పాక్ నటి సబా కమర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ షాక్ అయ్యే వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ తో కలసి నటించనని అతడొక చీప్ నటుడని వ్యాఖ్యానించింది. అతనికి అసలు స్టైల్ తెలియదని అభిమానులు మండి పడే వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు ఇమ్రాన్ హాష్మిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మి కి సీరియల్ కిస్సర్ అనే పేరు ఉంది. అతనితో కలసి నటిస్తారా అని ప్రశించగా.. అస్సలు నటించనని తేల్చి చెప్పేసింది. అతడిని ముద్దుపెట్టుకుంటే నోటి క్యాన్సర్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. సబా వ్యాఖ్యలతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా అవాక్ అయిందనే చెప్పాలి. పాక్ నటుల్ని బాలీవుడ్ లోకి తీసుకోవద్దని పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు మరింత చిచ్చు రాజేసేలా ఉన్నాయి.