పందెంకోడి-2కి షాకింగ్… హెచ్‌డీ క్వాలిటీతో ఫుల్ మూవీనీ ఆన్‌లైన్‌లో పెట్టేశారు..!

Saturday, October 20th, 2018, 11:01:16 AM IST

మాస్ హీరో విశాల్ న‌టించిన పందెంకోడి2 చిత్రం విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే పందెకోడి2 చిత్రం విడుద‌ల అయ్యి రెండు రోజులు కూడా కాంకుండానే పైర‌సీ బారిన ప‌డింది. హెచ్‌డీ క్వాలిటీతో ఫుల్ మూవీనీ పైర‌సీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టేశారు పైర‌సీ రాయుళ్ళు. దీంతో ఇప్ప‌టికే యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి భారీగా లాస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చిత్ర నిర్మాత‌లు ఆందోళ‌ణ చెందుతున్నారు.

ఇక గ‌త కొంతకాలంగా విశాల్‌కి- పైర‌సీ రాయుళ్ళ‌కి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జరుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఆ గొడ‌వ‌లో విశాల్ కోలీవుడ్‌లో పైర‌సీని అంతం చేస్తాన‌ని మంగ‌మ్మ‌శ‌ప‌థం చేశారు. అయితే పైర‌సీ రాయుళ్ళు మాత్రం ఈసారి ఏకంగా హెచ్‌డీ క్వాలిటీతోనే మొత్తం సినిమాని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఈ చిత్రం పైర‌సీ జ‌రుతుంద‌ర‌ని ముందుగానే గ్ర‌హించిన విశాల్.. పైర‌సీకి అడ్డా అయితే ప‌లు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌లేదు. అయినా కూడా ఈ చిత్రం విడుద‌ల అయిన రెండు రోజుల‌కే క్వాలిటీ ప్రింట్‌తో ఇంట‌ర్‌నెట్‌లో ద‌ర్వ‌న‌మివ్వ‌డంతో సినీ వ‌ర్గాలు షాక్‌కు గురిఅవుతున్నారు. ఏది ఏమైనా విశాల్ పై పైర‌సీ రాయుళ్ళే పైచేయి సాధించార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి విశాల్ రియాక్ష‌న్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments