అజ్ఞాతవాసిపై పరుచూరి రివ్యూ..!

Wednesday, January 10th, 2018, 01:35:48 AM IST

అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు కొద్ది సమయం మాత్రమే ఉంది. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అజ్ఞాతవాసి చిత్రంపై స్పదించారు. తనదైన శైలిలో అజ్ఞాతవాసి టీజర్, ట్రైలర్ పై విశ్లేషణ అందించారు. మొదట టీజర్ చూసిన తరువాత త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ లు కంప్లీట్ క్లాసికల్ మూవీ తో వస్తున్నారనిపించింది. కానీ ట్రైలర్ విడుదల అయ్యాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని తెలిపారు.

ట్రైలర్ చూసాక ఇందులో మాస్ అంశాలు కూడా ఉన్నాయని తెలిసింది. ‘వీడి చర్యలు ఊహాతీతం’ అనే డైలాగ్ ద్వారా పవన్ కళ్యాణ్ పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని అర్థం అయింది. కనిపించకుండా దాగి ఉండడమే అజ్ఞాతవాసం అంటే. మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఓ మినీ యుద్ధమే జరుగుతుంది అనే డైలాగ్ తనకు బాగా నచ్చిందని పరుచూరి అన్నారు. మానవ నాగరికతలో ప్రతి సౌకర్యం వెనుక యుద్ధం జరుగుతోంది.. అదే డైలాగ్ లోని ఆంతర్యం. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత యుద్ధం.. ఆతరువాత రాజ్యం.. అజ్ఞాతవాసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని పరుచూరి తెలిపారు.