పార్వ‌తి మీన‌న్ మీద‌ లైంగిక దాడి.. సినీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం..!

Wednesday, October 31st, 2018, 03:33:50 PM IST

దేశ‌వ్యాప్తంగా మీ..టూ ఉధ్య‌మం సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బామ త‌నుశ్రీ ద‌త్తా త‌నను లైంగికంగా వేధించాడ‌ని నానా పాటేక‌ర్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మొద‌లైన ఈ కాస్టింగ్ కౌచ్ ర‌చ్చ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా మ‌ళ‌యాలం కుట్టి పార్వ‌తి మీన‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక అసలు విష‌యానికి వ‌స్తే.. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయిన పార్వతి మీనన్‌కు ఇప్పుడు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి.

అయితే దానికి కార‌ణం మాళ‌యాల హీరో దిలీప్ అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. గ‌తంలో నటుడు దిలీప్‌ను మ‌ళ‌యాల సినీ సంఘంలోకి తీసుకోవడంతో పార్వ‌తి వ్య‌తిరేకించ‌డ‌మే కాకుండా అత్యాచార కేసులో ఉండ‌గా సంఘంలోకి అత‌న్ని ఎలా తీసుకోవ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది. దీంతో అక్క‌డ పార్వ‌తికి అవ‌కాశాలు ఇవ్వ‌కుండా అనేక ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేశార‌ని పార్వ‌తి తెల్పింది. అయితే ఇటీవ‌ల బాలీవుడ్ అవ‌కాశం త‌లుపు త‌ట్ట‌డంతో అక్క‌డ ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన పార్వ‌త్రి మీన‌న్ త‌న పై అత్యాచారం మూడేళ్ళ వ‌య‌సులోనే జ‌రిగింద‌ని.. ఆ విష‌యం గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా మ‌న‌శ్శాంతి దూర‌మ‌వుతోంద‌ని పార్వ‌తి సంచ‌ల‌న విష‌యాలు చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments