లేటెస్ట్ వైరల్ న్యూస్ : పవన్ – క్రిష్ ల సినిమా టైటిల్ ఏంటో తెలుసా…?

Tuesday, February 11th, 2020, 09:25:46 PM IST

ప్రస్తుతానికి అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత మళ్ళీ చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. కాగా ప్రస్తుతం హిందీలో విజయం సాధించిన “పింక్” అనే చిత్రాన్ని తెలుగులో పవన్ తో తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు కూడా. అయితే ఈ సినిమా తరువాత వెంటనే క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్… అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారని సమాచారం.

కాగా మొఘలాయిలా కాలం నాటి కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, తెలంగాణ రాబిన్ హుడ్ తరహా పేరుగాంచిన “వీరు” అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే అందుకు తగ్గట్టుగానే ఆ పాత్రకి సూట్ అయ్యేలాగా ఈ చిత్రానికి “వీరూపాక్షి” అనే టైటిల్ పెట్టనున్నారని తాజా సమాచారం. కాగా ప్రస్తుతానికి ఈ వార్త సామాజిక మాంద్యమాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి తగ్గట్టుగా తన గడ్డాన్ని తీసేసి, కోర మీసాలు, టాటూలతో కనిపిస్తున్నాడని సమాచారం.