చివరికి పవన్ సినిమాకి ఆ హీరోయిన్ దొరికిందా…?

Sunday, February 9th, 2020, 10:17:41 PM IST

రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ కపూర్ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నివేత థామస్, అనన్య ఇద్దరు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్నటువంటి సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని, అందుకు గాను పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఆ చిత్రానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటున్నారని సమాచారం.

అయితే పవన్, క్రిష్ ల కలయికలో రానున్నటువంటి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ లాంటి పెద్ద గజ దొంగ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మొఘలాయిల కాలం నాటి ఒక పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ “పండగ సాయన్న” పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ హీరోయిన్ దొరకడం కాస్త సమస్య గా మారిందని సమాచారం. అందుకనే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ కథానాయిక వాణికపూర్ ని తీసుకున్నారని సమాచారం. ఈ హీరోయిన్ గతంలో తెలుగులో ఒక చిత్రం చేసినప్పటికీ కూడా ఆ చిత్రం పెద్దగా ఆడకపోగా, ఆమెకి ఆఫర్లు కూడా కరువయ్యాయి… అయితే అలాంటి హీరోయిన్ ని పవన్ కి ఫిక్స్ చేసినందుకు గాను పవన్ అభిమానులు కొందరు దర్శకుడు క్రిష్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కానీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.