క్రేజీ కాంబినేషన్ : చరణ్ నిర్మాత, పవన్ హీరో… ఎప్పుడో తెలుసా…?

Friday, October 18th, 2019, 09:49:42 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతానికి ప్రజాసేవకై రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన అదినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మళ్ళీ సినిమాలుచేయడనికి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈమేరకు హరీష్ శంకర్, బోయపాటి, క్రిష్ దర్శకత్వంలో సినిమాలు కూడా ఉండబోతున్నాయని సమాచారం. కాగా పవన్ తన రీ ఎంట్రీ సినిమాని బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో చేయనున్నాడని వార్త బాగా ప్రచారంలో ఉంది. కానీ ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట.

అయితే బోయపాటి దర్శకత్వంలో రానున్నటువంటి ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించాలని చాలా ప్రయతలు చేస్తున్నారు కానీ ఎలాగైనా సరే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ లో నిర్మించాలని రామ్ చరణ్ గతం లోనే పవన్ ని అడిగారని, అందుకు పవన్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే వరుసగా విజయవంత మైన చిత్రాలు నిర్మిస్తున్నటువంటి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో పవన్ సినిమా వస్తే రికార్డులు బద్దలవడం ఖాయమని మేఘ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మొదలవనుందని సమాచారం. కానీ ఈ విషయం అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.