పవన్ భారీ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచేనా?

Sunday, May 24th, 2020, 07:27:13 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ “వకీల్ సాబ్” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రం అతి త్వరలోనే పూర్తి కానుంది.

అయితే దీని తర్వాత మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కోసం కూస్తో పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. మంచి హైప్ ను సంతరించుకున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే జూలై నుంచి మొదలు కాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

ఎలాగో జూన్ నుంచి అన్ని చిత్రాల షూటింగ్స్ ప్రారంభం అవుతుండగా ఇందులో వకీల్ సాబ్ పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత పవన్ క్రిష్ ల ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.