అందుకే చిన్నమామను రంగంలోకి దింపుతున్నాడా ?

Sunday, March 4th, 2018, 02:30:24 AM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. ఇప్పటికే అయన చేసిన ఐదు సినిమాలు వరుసగా పరాజయాల పాలయ్యాయి. దాంతో తన కెరీర్ అయోమయంలో పడిందని దాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డాడు సాయి ధరమ్. ప్రస్తుతం అయన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న తేజు .. ఈ సినిమా ఆడియో వేడుకకు చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కరుణాకరన్ తో పవన్ చేసిన తొలిప్రేమ ఎవరు మరచిపోలేరు .. అలంటి క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈ వేడుకకు పవన్ గెస్ట్ గా వస్తే తన సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని భావించాడు తేజు. అల్లుడి కోసం మావయ్య తప్పకుండా వస్తాడని అంటున్నారు.