ఫోర్బ్స్ జాబితా ప్రకారం పవన్ కళ్యాణ్ కు మొదటి స్థానం

Friday, December 13th, 2013, 09:04:55 PM IST


భారతదేశంలో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు మొదటి స్థానం లభించింది. ఫోర్బ్స్ సంస్థ 2013 సంవత్సరానికి రూపొందించిన భారతదేశ సెలబ్రిటీల జాబితాలో నటుడు పవన్ కళ్యాణ్ 26 వ స్థానంలో దక్కింది. ఫోర్బ్స్ జాబితా తెలియజేసిన ప్రకారం ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ 57కోట్ల డబ్బు సంపాదనతో 13వ ర్యాంక్, పాపులారిటీలో 79స్థానంలో నిలిచాడు. ఆ తరువాత స్థానంలో 28. 96 కోట్ల సంపాదనతో మహేష్ బాబు 54వ స్థానంలో నిలిచాడు. నాగార్జున 20. 5 కోట్లతో 61వ స్థానంలో, రవితేజ 13 కోట్లతో 68 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత 69 వ స్థానంలో 12. 67 కోట్లతో రామ్ చరణ్ ఉన్నాడు.