నేను చేయలేని పని రామ్ చరణ్ చేశాడు..అది మా కుటుంబానికే చెందింది

Thursday, August 22nd, 2019, 12:05:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య గురించి, తమ ఫ్యామిలీ గురించి, సైరా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడాడు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ గురించి అయితే చాలా గొప్పగా చెప్పాడు. నేను మొదటి నుండి ఎలాంటి సినిమాల్లో చూడాలనుకుంటాడో అలాంటి సినిమా సైరా నరసింహ రెడ్డి. నేను ఆలా చూడాలని అనుకునేవాడిని మాత్రమే, కానీ రామ్ చరణ్ మాత్రం ఏకంగా అలాంటి సినిమా
తీయటం జరిగింది .

డబ్బులు వస్తాయా లేదా..! అనే విషయం కాకుండా స్వాతంత్రం కోసం పోరాడిన మొదటి యోధుడి గురించి భారతదేశం మళ్ళీ మాట్లాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో అది కూడా చిరంజీవి గారితో చెపితేనే బాగుంటుందని భావించి ఈ సినిమాని తీసాడు రామ్ చరణ్. నేను చేయలేని పనిని నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ చేయటం నాకు హ్యాపీగా ఉంది. మా ఇంటి పేరు కొణిదెల ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలియదు. చిన్నప్పుడు అడిగిన ఎవరు చెప్పలేదు.

కర్నూల్ జిల్లా నందికొట్కూర్ సమీపంలో కొణిదెల అనే గ్రామం ఉంది. సైరా నరసింహ రెడ్డికి ఆ గ్రామానికి సంబంధం కూడా ఉంది, అలా చూసుకుంటే ఆ ఇంటి పేరు కలిగిన మేమే సినిమా తీయటం విశేషం. ఇందులో మా అన్నయ్య నటించటం, దానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించటం గొప్ప అనుభూతి. కొడుకుని సినిమాకి ఎంట్రీ చేసే బాధ్యత తండ్రి తీసుకోవటం మనకి తెలుసు, కానీ ఇక్కడ తండ్రి రీ ఎంట్రీ బాధ్యతని కొడుకు తీసుకున్నాడు ఖైదీ 150 సినిమాతో, అలాగే మా అన్నయ్య కెరీర్ లో నిలిచిపోయే సైరా లాంటి సినిమాని కూడా ఎంతో దైర్యంగా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చాడు.