ప‌వ‌న్ డిసెంబ‌రులో.. మ‌హేష్ జ‌న‌వ‌రిలో

Tuesday, September 20th, 2016, 02:10:02 AM IST

pawan-mahesh
చేస్తున్న సినిమా పూర్త‌యితే త‌ప్ప మ‌రొక సినిమా గురించి ఆలోచించే అల‌వాటు లేని క‌థానాయ‌కులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు. ముందుగా క‌థ‌లు విని పెట్టుకొన్న‌ప్ప‌టికీ సెట్స్‌పైకి మాత్రం సినిమా పూర్త‌యిన త‌ర్వాతే తీరిగ్గా వెళుతుంటారు. అయితే తొలిసారి ఇద్ద‌రూ కూడా చేస్తున్న సినిమాల‌తో సంబంధం లేకుండా కొత్త సినిమాలకి డేట్లు ఇచ్చేశారు. ఆ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఆ సినిమాకి డిసెంబ‌రులో కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. అలాగే మ‌హేష్‌బాబు కూడా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న త‌న కొత్త సినిమాని జ‌న‌వ‌రిలో ఆరంభిస్తాడ‌ట. ప‌వ‌న్‌, మ‌హేష్‌బాబులిద్ద‌రూ కూడా ప్ర‌స్తుతం ఒక్కో సినిమాతో బిజీగా ఉన్నారు. వాళ్లు చేస్తున్న సినిమాలు డిసెంబ‌రు, జ‌న‌వ‌రి మాసాల్లోపు పూర్త‌వుతాయో లేదో కూడా తెలీదు. కానీ కొత్త సినిమాల‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ముహూర్తం ప్ర‌కారం ఆయా నెల‌ల్లో కేవ‌లం కొబ్బ‌రికాయ కొట్టి ఆగిపోతారా లేక సెట్స్‌పైకి కూడా వెళ‌తారా అన్న‌ది చూడాలి.