ఆ విలక్షణ నటునికి పద్మశ్రీ ఇవ్వాలని పవన్ డిమాండ్.!

Saturday, July 25th, 2020, 01:01:48 PM IST

మన తెలుగులోనే వెర్సటైల్ నటులు చాలా మంది ఉన్నారు. తమకు ఇచ్చిన ఎలాంటి పాత్రను అయినా సరే అత్యద్భుతంగా రక్తి కట్టించగలిగే సీనియర్ నటులలో అగ్ర నటులు కైకాల సత్యన్నారాయణ గారు కూడా ఒకరు. స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో మరెన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. కానీ ఆయన ప్రతిభకు తగ్గ గౌరవం మాత్రం ఇంకా దక్క లేదు.

ఇదిలా ఇందాకా ఈరోజు ఆయన జన్మదినం సందర్భముగా ఎందరో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన శుభాకాంక్షలను జనసేన పార్టీ తరపున తెలిపారు. ఆయనకు తమ కుటుంబానికి మరియు వ్యక్తిగంతంగా తనకి అత్యంత సన్నిహితులు అని ఆయన్ను కలిసిన ప్రతీసారి అత్యంత వాత్సల్యంగా మాట్లాడుతారని మచిలీపట్నం నుంచి ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఎంపిక అయినపుడు ఆయనతో మాట్లాడిన క్షణాలు ఇంకా గుర్తున్నాయని తెలిపారు.

నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు రాకపోవడం ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు సహా నాకు కూడా ఒకింత బాధ కలిగించింది అని తెలిపారు. అందు మూలాన ఆయనకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశ్రీ అవార్డు వచ్చేలా కృషి చెయ్యాలని సూచించి మరోసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ విడుదల చేసారు.