హాట్ టాపిక్: క్రిష్ కి క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్…కారణం తెలుసా?

Tuesday, March 24th, 2020, 11:03:41 AM IST

కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన ఫామ్ హౌస్ లో తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. మొక్కలు, జంతువులు, పుస్తకాలతో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే తాజా సమాచారం మేరకు పవన్ తన దర్శకులతో విడివిడిగా సమావేశం అయినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రోగ్రెస్ ను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ తో కూడా సమావేశమైన పవన్, ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఆ ప్రయోగాలు మానుకోవాలని సూచించారు. మూవీ బడ్జెట్ పెంచిన తర్వాత మార్కెట్ సమస్యలు ఎత్తే అవకాశం ఉందని అన్నారట.

చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కి నష్టాలను చవిచూసింది. అందుచేత కరోనా వైరస్ ప్రభావం తగ్గాక, సినిమాల షూటింగ్ విషయం లో పవన్ వకీ ల్ సాబ్ చిత్రానికి మిగతా డేట్స్ నీ అడ్జస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి క్రిష్ తాను అనుకున్నట్లుగా తీయాలంటే ఎక్కువ డేట్స్ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తనతో చెప్పిన వ్యాఖ్యల పట్ల క్రిష్ చాలా అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది.