పవన్ కోసం పొలిటికల్ కథను సిద్ధం చేసిన దర్శకుడు ?

Sunday, October 29th, 2017, 08:37:44 PM IST

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా నెక్స్ట్ షెడ్యూల్ యూరోప్ లో జరగనుంది. పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా జనవరిలో విడుదల విడుదల అయ్యేందుకు సన్నాహాలు జోరందుకున్న నేపథ్యంలో పవన్ నెక్స్ట్ సినిమా ఏమిటనే ఆసక్తి అందరిలో నెలకొంది. దానికి కారణం ఇప్పటికే ముగ్గురు దర్శకులు పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ దర్శకులు ఎవరంటే సంతోష్ శ్రీనివాస్, నేసన్ , ఇప్పుడు క్రిష్? తాజాగా క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఓ సూపర్ కథను సిద్ధం చేసాడట !! అయితే అదికూడా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాక్. నిజానికి వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్న పవన్ కోసం పొలిటికల్ కథ అయితే కరక్ట్ అనే ఉద్దేశంతోనే క్రిష్ ఆ కథను సిద్ధం చేసాడట? సో త్వరలోనే ఈ కథను పవన్ కు చెప్పి ఒప్పించే పనిలో పడ్డాడు. క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణికా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తీ కావొచ్చినా నేపథ్యంలో నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు.

  •  
  •  
  •  
  •  

Comments