పవన్ రీఎంట్రీ ఆ హీరోల ఫై గట్టి ప్రభావం చూపిస్తుందా?

Sunday, February 9th, 2020, 07:09:47 PM IST


సినిమా హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చినా, సినిమా ప్లాప్ అయినా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చివరగా వచినటువంటి అజ్ఞాతవాసి చిత్రం సైతం మొదటిరోజు వసూళ్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని నిర్మాతలు భారీ పారితోషికాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబాన్ని, జనసేన పార్టీ ని నడపడానికి ఆ మొత్తాన్ని ఉపయోగించనున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వడం తో ఇపుడిపుడే ఎదుగుతున్న కొందరు హీరోలకు దెబ్బ అని చెప్పాలి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు సైతం పవన్ సినిమా వస్తే కొంత గ్యాప్ తీస్కొని విడుదల చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీ లో అంతటి పోటీ ఇచ్చే స్టార్ హీరో ఎవరంటే అందరు మహేష్ బాబు అనే చెబుతారు. అయితే పవన్ రీఎంట్రీ తో మహేష్ వంశీ పైడిపల్లి తో చేయనున్న చిత్రాన్ని కాస్త ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇంత స్పీడ్ గా సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ స్పీడ్ కూడా ఒక కారణం అని కొందరు చెప్పుకొస్తున్నారు.